Wednesday, January 22, 2025

ఆత్మహత్య చేసుకుంటామని దంపతుల సెల్ఫీ వీడియో

- Advertisement -
- Advertisement -

వైజాగ్: ఓ దంపతులు ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో పంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వర ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి తిరుమలనగర్‌లో ఉంటున్నాడు. ఓ స్టీల్‌ప్లాంట్‌లో జాబ్ చేస్తున్నాడు. గత కొన్ని రోజుల వర ప్రసాద్ కుటుంబానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. వరప్రసాద్ తన భార్య మీరాతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో తీసి పంపించారు. వెంటనే ఆ దంపతుల కుమారుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారాంగా అనకాపల్లి కొప్పాక ఏలూరు కాల్వ వద్ద చెప్పుడు, హ్యాండ్ బ్యాగ్, మొబైల్‌ను గుర్తించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News