Thursday, November 14, 2024

ఐఫోన్ కోసం 8 నెలల పసిబిడ్డ అమ్మకం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ప్రస్తుత పరిస్థితులలో ఐఫోన్ ఉండడం ఒక ముఖ్య అవసరమే కావచ్చు..కాని అది లేకపోతే బతుకేలేదు అనుకోరాదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక జంట ఐఫోన్ కొనడానికి చేసిన పని తలచుకుంటే ఎవరైనా షాక్‌కు గురి కాకమానరు. ఐఫోన్ 14 కొనడానికి తమ 8 నెలల పసిబిడ్డను అమ్మేసింది ఆ జంట. అది కూడా రాష్ట్రమంతటా షికారు చేస్తూ రీల్స్ వీషూట్ చేయడం కోసం ఆ పని చేసిందని తెలిస్తే ఆ జంటను ఏం చేయాలి.

పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోటీసులు ఆ బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న తండ్రి జయదేవ్ ఘోష్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కొద్ది రోజులుగా బిడ్డ కనిపించకపోవడం, బిడ్డ తల్లిదండ్రుల్లో ఏ విధమైన ఆందోళన లేకపోవడంతో ఇరుగురువారిలో అనుమానం మొదలైంది. జయదేవ్ ఘోష్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడం..వారి చేతిలో కొత్త ఐఫోన్ 14 కనిపించడంతో వారిలో అనుమానం మరింత బలపడింది. దీంతో వారు జంటను బిడ్డ గురించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఐఫోన్ కోసం తాము బిడ్డను అమ్మేసినట్లు ఆ జంట ఒప్పుకుంది.

గతంలో తమ ఏడేళ్ల కుమార్తెను అమ్మడానికి తన భర్త జయదేవ్ ప్రయత్నించాడని కూడా ఆ తల్లి చెప్పింది. బిడ్డను అమ్మిన జంటపై పోలీసులు కేసు నమోదు చేయడంతో మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బిడ్డను కొనుక్కున్న మహిళపై కూడా కేసు నమోదు చేశారు.ఇందుకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News