Monday, January 20, 2025

మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చందుర్తి మండలం ముడపెళ్లి గ్రామం యువతి కిడ్నాప్‌ కేసులో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ఆశ్రయించిన దంపతులు, వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని మంగళవారం రోజు తెల్లవారుజామున తండ్రి కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడు తన ముగ్గురి స్నేహితులతో ఆమెను కిడ్నప్ చేశారు అనే సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీస్ యంత్రంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యేక టీమ్స్ గా ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించడం జరిగింది. విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురిలో ఇద్దరిని వేములవాడ వద్ద పట్టుకోవడం జరిగింది..ఆ ఇద్దరిని విచారించగా వారు ఎం జరిగిందో చెప్పురు అంతలోనే అమ్మాయి అబ్బాయి కొండగట్టులో మేము మా ఇద్దరి ఇష్టం మేరకే పెళ్లి చేసుకున్నాం అని వీడియో ద్వారా వారు స్టేట్మెంట్ పంపివ్వడం జరిగింది.

అక్కడికే విచారణ పూర్తి చేసి వారిద్దరిని ఎస్పీ కార్యాలయానికి పిలిపించుకొని కౌన్సెలింగ్ ఇవ్వగా అమ్మాయి మేము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం ఎవరు కూడా నన్ను బలవంతంగా కిడ్నాప్ చేయలేదని అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది.. అదేవిధంగా మాకు మా కుటుంబ సభ్యుల నుండి ప్రాణభయం ఉందని చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులకు వేములవాడ డిఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.. వారికి ఎలాంటి ప్రాణభయం లేకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి తప్పుడు సమాచారాలతో జిల్లా యంత్రాంగం యెక్క సమయం వృధా చేయవద్దని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News