Wednesday, January 15, 2025

విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

రాఖీ పౌర్ణమి పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం చోటెచేసుకుంది. విద్యుత్ ఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, బస్వాపురంలో సోమవారం చోటుచేసుకుంది. స్థ్ధానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపురానికి చెందిన బాణోత్ సెమినా (36) సోమవారం ఉతికిన బట్టలు దండెంపై ఆరవేస్తుండగా, అలాగే నిశ్చేష్టురాలై ఉండిపోయింది. గమనించిన భర్త బాణోత్ శ్రీను (40)

ఆమెకు హృదయ సంబంధమైన వ్యాధి ఉండటంతో అందువల్లే అలా ఉండిపోయిందేమో అనుకొని, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మంచంపైకి తీసుకువద్దామని ఆమెను పట్టుకున్నాడు. గాలికి వూగి తెగిన కరెంటు వైర్లు దండేనికి తాకడంతో దాని నుంచి విద్యుత్తు ప్రవహించింది. వెంటనే విద్యుత్ షాక్‌తో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దంపతులకు ప్రియాంక అనే కూతురు ఉంది. కాగా, రాఖీ పండుగ వేళ ఒకేఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ అకాల మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News