Wednesday, January 22, 2025

దైవ దర్శనానికి వెళ్తూ భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: తునికి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం అటవీప్రాంతంలోని హానుమాన్ టెంపుల్ వద్ద గురువారం చోటు చేసుకుంది. కుటుంబీకులు…పోలీసుల కథనం ప్రచారం… మెదక్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి (36), జక్కుల యాదమ్మ (32) దంపతులు. కౌడిపల్లి మండలం తునికి శివారులోని నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు యాదగిరి, యాదమ్మ టివిఎస్ ఎక్సెల్‌పై బయల్దేరారు.

ఈ క్రమంలో కౌడిపల్లి మండలం అంతారం అటవీ ప్రాంతంలోకి చేరుకోగానే మెదక్ వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో అతి వేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు యాదగిరి మేస్తీ పనిచేసుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News