Sunday, January 19, 2025

ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు..భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దకొత్తపల్లి: ఆటోను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టిన సంఘటనలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలో వావిల్లబాయి గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం… చంద్రకల్ గ్రామానికి చెందిన పకీర్ హుస్సేన్ (35), హసీనా (28) పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకుని జీవనం కొనసాగించేవారు.

సోమవారం ట్రాలీ ఆటోలో (ఎపి29యు7756) ఆటోలో చంద్రకల్ గ్రామానికి వెళ్తుండగా వావిల్లబాయి గ్రామం వద్ద హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు (టిఎస్ 07 యుజి 7848) ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని తల్లి మహబూబ్బి ఫిర్యాదు పోలీసులు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News