సదాశివనగర్ : అంత్యక్రియలకు వెళుతున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మణం పాలయ్యారు. ఈ విషాధ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామానికి చెందిన ముస్కు రాజన్న సోమవారం వేకువజామున మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న అతని బంధువు ఏనుగు జనార్దన్ రెడ్డి47, భార్య ఏనుగు ప్రతిభ 36 తో కలిసి సదాశివనగర్ గ్రామం నుండి తన స్కూటీపై అంత్యక్రియలకు బయలుదేరారు. పద్మాజివాడి గ్రామ స్టేజీ యూటర్న్ వద్ద గుర్తు తెలి యని వాహనం వేగంగా వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతిభ అక్కడికక్కడే మృతి చెందగా, జనార్దన్ రెడ్డి రెండు కాళ్లు విరిగి శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతోఅపస్మారకస్తితిలోకి వెళ్లాడు.
స్థానికుల సమాచారం మేరకు సీఐ బి.సంతోష్ కుమార్, ఏఎస్సై రన్సయ్యతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రునికి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతు జనార్దన్ మృతి చెందాడని సీఐ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడు జనార్దన్ రెడ్డి సదాశివనగర్ సొసైటీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అతనికి ఒక కుమారుడు,తల్లీ ఉన్నారు. ప్రమాదంలో దంపతులు మరణించడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.