Sunday, January 19, 2025

మూల మలుపు వద్ద మరో ప్రమాదం.. భార్య భర్తలకు తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాతీయ రహాదారి మూల మలుపు వద్ద మరో ప్రమాదం నెలకొంది. బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రగాయాల పాలయ్యారు. సోమగూడెం నుండి బెల్లంపల్లి వైపుకు ద్విచక్ర వాహనంపై బిజూన్ ప్రాంతానికి చెందిన బండారి ఐలయ్య, బండారి సరోజన దేవుడికి మొక్కులు తీర్చుకునేందుకు బెల్లంపల్లి వైపు వెళ్తుండగా సోమగూడెం వైపు నుండి తాండూర్ వైపు వెళ్తున్న పాల వ్యాను అతి వేగంగా ఢికొట్టడంతో సరోజన బైక్ పైనుండి కింద పడింది.ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఐలయ్యకు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం మలుపు తిరుగుచుండగా వెనక వైపు నుండి వచ్చిన పాల వ్యాను ఢికొట్టడంతో ప్రమాదం నెలకొంది. కొన్ని రోజుల క్రితం ఇదే స్థలంలో జనగామ రజిత, జనగామ తిరుపతిలు బెల్లంపల్లికి వెళ్తుండగా వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో రజిత మృతి చెందింది. ఈ ఘటన జరిగి కొన్ని రోజులే కాగా బుధవారం మరో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు బెంబేలేత్తి పోతున్నారు. ప్రస్తుతం సరోజన ను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహాదారి అంబులెన్స్‌లో వారిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. కాసిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News