Saturday, December 28, 2024

వాషింగ్ మిషన్ పేలి దంపతులకు తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: వాషింగ్ మిషన్ పేలి దంపతులు తీవ్రంగా గాయపడిన ఘటన కామారెడ్డి పట్టణంలోని ఎన్జివోస్ కాలనీ సప్తగిరి వీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వాషింగ్ మిషన్ పేలడంతో వృద్ధ దంపతులైన బాలయ్య,బాల లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం దంపతులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.భారీ శబ్దంతో పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురైనారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News