Sunday, December 22, 2024

భూవివాదంతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

జనగామ : భూవివాదం వల్ల భార్యాభర్తలు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యతండాలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నర్మెట మండలం సూర్యతండాకు చెందిన భూక్య గురు భూక్య-సునీతలకు తాతల ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన సర్వే నంబర్ 258లో 1.09 ఎకరాల భూమి తన భార్య సునీతపై పేరిట రికార్డుల్లో ఉంది. కాగా అదే గ్రామానికి చెందిన భూక్య జయరాం, భూక్య సురేందర్, భూక్య శ్రీను కొంతకాలంగా వివాదాలు సృష్టిస్తున్నారని, దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని,

దీంతో ఎస్సై, రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాలని సూచించడం జరిగింది. ఆ సర్వే పూర్తై రిపోర్ట్ రాకుండా భూక్య జయరాం, భూక్య సురేందర్, భూక్య శ్రీనులు ఇబ్బందులు పెడుతున్నారని మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను తన మెబైల్‌లో సెల్ఫీ తీశారు. గమనించిన స్థానికులు ఆ దంపతులను చికిత్స నిమిత్తం జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News