- Advertisement -
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం రత్నాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు దంపతులను దారుణంగా హత్యచేశారు. మృతులను రంగయ్య(50), ముత్తమ్మ(45)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -