ఢిల్లీ: ఆ పిల్లాడి పట్టుమని పదేళ్లు లేవు. అతడి పేరు జస్ప్రీత్. అతడి తండ్రి చనిపోయాడు. అయినా మొక్కవోని ధైర్యంతో, రొట్టెలు చేసి అమ్ముతూ బతుకుతున్నాడా బాలుడు. అతడి విషయాన్ని mrsinghfoodhunter అనే ఇన్ స్టాగ్రామ్ ఐడి ఉన్న ‘వ్లాగర్’ సరబ్ జీత్ సింగ్ అనే వ్యక్తి వీడియో చేసి షేర్ చేశాడు. ఢిల్లీలోని తిలక్ నగర్ లో తన తండ్రి నడిపిన స్ట్రీట్ సైడ్ స్టాల్ నే ఆ పిల్లాడు నడుపుతున్నాడని పేర్కొన్నాడు.
తాను, తన సోదరి కలిసి తండ్రి మరణానంతరం జీవితంలో ఛాలేంజ్ లను ఎదుర్కొంటున్న విషయాన్ని ఆ పిల్లాడు నవ్వుతూ తెలిపాడు. తన తండ్రి టిబితో చనిపోయినట్లు తెలిపాడు. సోదరితో కలిసి రొట్టెలు చేస్తూ జీవితం గడుపుకొస్తున్నట్లు తెలిపాడు. వారికి అండగా ఢిల్లీలో వారి అంకుల్ ఉన్నాడు. వారి తల్లి మాత్రం పంజాబ్ కు వెళ్లిపోయి ఉంటోంది. ధైర్యానికి మారు పేరుగా ఆ పిల్లాడు బతుకుతున్నాడు.
ఆ పిల్లాడి విషయంలో ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ ఆనంద్ మహీంద్ర స్పందించాడు. ఆ పిల్లాడి గురించి తెలిసిన వారు నంబర్ ఇస్తే కాంటాక్ట్ చేస్తాము. అతడి చదువు నిరాటంకంగా కొనసాగేందుకు సాయపడతాం. ఆనంద్ మహీంద్ర ఫౌండేషన్ తప్పక సాయం అందించగలదని నెట్ లో పోస్ట్ పెట్టారు.
Courage, thy name is Jaspreet.
But his education shouldn’t suffer.
I believe, he’s in Tilak Nagar, Delhi. If anyone has access to his contact number please do share it.
The Mahindra foundation team will explore how we can support his education.
— anand mahindra (@anandmahindra) May 6, 2024