Friday, November 15, 2024

నవీన్ రెడ్డి పోలీసు కస్టడీకి కోర్ట్ అనుమతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పోలీస్ కస్టడీకి ఇబ్రహీంపట్నం కోర్ట్ అనుమతించింది. దీంతో ఆయనను పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. కాగా… హైదరాబాద్ శివార్లలో బిడిఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం గోవాలో నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిన హైదరాబాద్‌కు తరలించారు. అతని సహచరులు కొందరిని హైదరాబాద్ శివార్లలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నవీన్ రెడ్డిని, అతని ఐదుగురు సహచరులను ఇబ్రహీంపట్నం కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

దీంతో నవీన్ రెడ్డిని, అతని సహచరులను పోలీసలు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు 38 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ రెడ్డి సన్నిహితులు రుమెన్, పవన్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఇకపోతే నవీన్ రెడ్డి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్‌ో్ల కీలక అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. “బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు వైశాలి నాకు పరిచయమైంది. నేను ప్రేమిస్తున్నట్టుగా వైశాలికి చెప్పాను. వైశాలి నా ప్రేమను నిరాకరిం చింది. వైశాలి తండ్రి దగ్గరికి ప్రేమ పెళ్లి ప్రపోజల్ తీసుకెళ్లాను.

అయితే ఆమె కుటుంబ సభ్యులు నా ప్రపోజల్‌ను ఒప్పుకోలేదు. వైశాలిని ఎలా గైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. అందుకే వైశాలిని వేధించడం మొదలుపెట్టాను. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో ఫొటోలు, వీడియోలు పెట్టానని అతను చెప్పాడు. ఇదిలావుండగా నవీన్ రెడ్డి సోదరుడు సందీప్ రెడ్డిని పోలీసులు ఈ నెల 16న అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డి, వైశాలి రెడ్డికి సంబంధించిన వీడియోలను సందీప్ సర్క్యూలేట్ చేస్తున్నందున అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గోవాలో నవీన్ రెడ్డి వీడియోలను రికార్డు చేసిన సందీప్ రెడ్డి, వంశీ భరత్ రెడ్డిలు వాటిని మీడియాకు పంపారు. ఇవి వైశాలి దృష్టికి వెళ్లడంతో ఆమె ఫిర్యాదు మేరకు సందీప్ రెడ్డి, వంశీ భరత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మీడియాలో వైశాలికి సంబంధించిన వీడియోలను ప్రసారం చేయొద్దని పోలీసులు మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News