- Advertisement -
రాంచి : ఝార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి మాజీ సిఎం హేమంత్ సోరెన్‌కు పిఎంఎల్‌ఎ కోర్టు గురువారం నిరాకరించింది. శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున అనుమతించాలని సోరెన్ కోరగా కోర్టు తిరస్కరించింది. భూ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో జనవరి 31న సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసిన తరువాత ఈ అరెస్ట్ జరిగింది. సోరెస్ సహచరుడు చంపాయి సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -