Thursday, January 23, 2025

జగదీశ్ టైట్లర్‌పై అభియోగాలు నమోదు చేయమన్న ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జగదీశ్ టైట్లర్ కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో ఢిల్లీలోని పుల్ బంగాస్‌ లో ముగ్గురు వ్యక్తుల హత్యకు సంబంధించి జగదీశ్ టైట్లర్‌పై హత్య, ఇతర నేరాల కింద అభియోగాలను నమోదు చేయాలని ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం సిబిఐని శుక్రవారంనాడు ఆదేశించింది. నిందితుడి విచారణకు తగినన్ని సాక్ష్యాలున్నలున్నట్టు ప్రత్యేక సిబిఐ న్యాయమూర్తి రాకేశ్ సియాల్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

సిబిఐ ఛార్జిషీటులో ఇంతకుముందు ఒక ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చాడు. 1984 నవంబర్ 1న ఒక తెల్లటి అంబాసిడర్‌లో వచ్చిన జగదీశ్ టైట్లర్.. పుల్ బంగాస్ గురుద్వారా వద్ద కారు దిగారని, అల్లరిమూకను రెచ్చగొట్టారని, మన తల్లిని చంపిన సిక్కులను మట్టుబెట్టండంటూ రెచ్చగొట్టారని అతను చెప్పాడు. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో టైట్లర్‌పై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంటూ సెప్టెంబర్ 13వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీకి కోర్టు ముందు టైట్లర్ హాజరుకావాలని కూడా కోర్టు ఆదేశించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News