Wednesday, January 22, 2025

బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పోలీసుల వినతి తిరస్కారం!

- Advertisement -
- Advertisement -
వరంగల్ జిల్లా కమలాపూర్‌లోని పరీక్షా కేంద్రం నుంచి స్కూల్ సెకండరీ సర్టిఫికేట్(ఎస్‌ఎస్‌సి) పరీక్ష హిందీ ప్రశ్నా పత్రం లీకేజీలో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా వరంగల్ పోలీసులు పేర్కొన్నారు.

హైదరాబాద్: పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్ కేసులో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ కోర్టు గురువారం కొట్టివేసింది. హనుమకొండ జిల్లా కోర్టు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సంజయ్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నాడంటూ, బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. గత రెండు రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంజయ్ బెయిల్‌ను రద్దు చేసే కారణాలు లేవంటూ కొట్టేస్తూ రూలింగ్ ఇచ్చింది.

కొన్ని షరతులపై బండి సంజయ్‌ను బెయిల్‌పై విడుదల చేయాలంటూ కోర్టు ఏప్రిల్ 6న ఉత్తర్వు ఇచ్చింది. కరీంనగర్‌లో ఏప్రిల్ 4న పెద్ద డ్రామా తర్వాత బండి సంజయ్‌ను ఆయన మామగారి ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు.

పదవ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో సంజయ్ ప్రధాన నిందితుడిగా వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి ఈ హిందీ ప్రశ్న పత్రం లీక్ అయింది. బండి సంజయ్‌ను అరెస్టు చేశాక యాదగిరి భువనగిరి జిల్లా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వరంగల్‌కు సాయంత్రం తీసుకొచ్చారు. హన్మకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ ఆయనను ఏప్రిల్ 19 వరకు జుడీషియల్ కస్టడీకి ఇస్తూ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు మరునాడే బెయిల్ ఇచ్చేసింది. పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్‌లో సంజయ్ పెద్ద కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐపిసి సెక్షన్లు 120బి, 420, 505 కింద సంజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది నిందితులను కూడా బుక్ చేశారు. పోలీసులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ పరీక్షలు(మాల్ ప్రాక్టీస్ నిరోధకం) లోని సెక్షన్లు 4(ఎ), 6, ఇంకా ఐటి చట్టం లోని 66డి సెక్షను కింద కూడా కేసులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News