Saturday, July 6, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కవిత, మనీశ్ సిసోదియా కస్టడీని జులై 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఇడి కేసులో కవిత, సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ బుధవారంతో ముగిసిన నేపథ్యంలో వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరు పర్చారు. ఈ కేసు విచారణను రౌస్ అవెన్యూ కోర్టు జులై 25కు వాయిదా వేస్తూ అప్పటి వరకు వారి కస్టడీని పొడిగించింది. మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎంఎల్‌సి కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని తిరస్కరించింది. కవితను ఈ కేసులో ఇరికించేందుకే ఆరోపణలు చేస్తున్నారని కవిత తరఫు న్యాయవాది వాదించగా, ఆమే మద్యం కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అని ఇడి, సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు.

వీరిరువురి వాదనలు విన్న న్యాయస్థానం కవిత రెండు పిటిషన్లను కొట్టివేస్తూ బెయిల్‌ను తిరస్కరిం చింది. మరోవైపు బుధవారం జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో జులై 25వ తేదీ వరకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 15న మద్యం కుంభకోణం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితను ఇడి అధికారులు అరెస్టు చేశారు. అనం తరం ఆమెను ఢిల్లీకి తరలించి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆమెకు వారం రోజులు ఇడి కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపిన విషయం విధితమే. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించి ఏప్రిల్ నెలలో రెండు రోజుల పాటు సిబిఐ విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ప్రశ్నల అనంతరం ఆమెను అరెస్టు చేశారు. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటుండగా, పలుమార్లు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమెను కలిసేందుకు బిఆర్‌ఎస్ శ్రేణులు తీహార్‌కు వెళ్లి వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News