Friday, April 4, 2025

వీసా కుంభకోణం : కార్తీ చిదంబరానికి తాత్కాలిక రక్షణ

- Advertisement -
- Advertisement -

 

Karti Chidambaram
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణను ఢిల్లీ కోర్టు గురువారం కల్పించింది. చైనీస్ వీసా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్గరేట్(ఈడి) నమోదు చేసిన కేసులో ఆయనకు కోర్టు ఈ ఊరటను కల్పించింది. కార్తీ చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తుపై ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్ ఈడికి నోటీసు కూడా జారీ చేశారు. ఆయన తండ్రి పి. చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు 2011లో 263 చైనా జాతీయులకు వీసాలు జారీచేయడం,మనీలాండరింగ్, ఇతర కుంభకోణాల విషయాల్లో ఈడి కార్తీ చిదంబరంపై కేసు నమోదుచేసింది. సిబిఐ కూడా ఇదే కేసులో ఇటీవల ఆరోపణలు చేయడంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్‌ఏ) కింద ఈడి కేసును దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News