సినీ నటుడు, రచయిత, వైసిపి నేత పోసాని కృష్ణమురళిని రెండ్రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేట పోలీసులు శని, ఆదివారం విచారించనున్నారు. ఎపి సిఎం చంద్రబా బు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై టిడిపి నేత కిరణ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిని అదుపు లోకి తీసుకున్న పల్నాడు పోలీసులు ఇటీవల నరసరావుపేట కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. పోసాని కస్టడీ కోరుతూ నరసరావుపేట పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం పోసానిని కస్టడీకి అనుమతినిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
పోసానికి బెయిల్ మంజూరు.. అయినా బయటకు రాని పరిస్థితే…!
నటుడు పోసాని కృష్ణమురళికి భారీ ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క కోర్టు బెయిల్ రద్దు చేసినా జైలుకే పరిమి తమవుతారు. ఆయన పైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.