Saturday, March 29, 2025

హత్య కేసులో 17 మందికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ఆజీంపేటలో బట్ట లింగయ్య అనే వ్యక్తి మర్డర్ కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. 2017లో దసరా రోజున లింగయ్యని 18 మంది గ్రామస్తులు రాళ్లతో కొట్టి హత్య చేశారు. హత్య చేసిన నిందితుల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా మిగితా 17 మందికి కోర్టు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.6 వేల జరిమానా విధించింది. అనంతరం పోలీసులు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా.. ఆజీంపేటలో పోలీసు బందోబస్తు, పికెటింగ్ జరిపారు. ఈ బందోబస్తును చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News