Wednesday, April 16, 2025

ఓటిటిలోకి ‘కోర్ట్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

- Advertisement -
- Advertisement -

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా. హర్ష్ రోషణ్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. నాచురల్ స్టార్ నాని సోదరి నిర్మించిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో శివాజీ, రోహిణి, ప్రియదర్శి, హర్ష్ రోషణ్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయి కుమార్, శుభలేక సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి(ఏప్రిల్ 11) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News