Monday, December 23, 2024

నటి కరీనా కపూర్ ఖాన్ కు కోర్టు నోటీసు

- Advertisement -
- Advertisement -

ముంబై: హిందీలో పేరు పొందిన నటి కరీనా కపూర్. ఆమె నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లాడక కరీనా కపూర్ ఖాన్ అయిపోయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు.  తాను తల్లయ్యే క్రమంలో, చూలాలు అనుభవంతో ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకాన్ని రాసేసింది. టైటిల్ లో ‘బైబిల్’ పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుకెక్కారు. దాంతో న్యాయమూర్తి గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జీ ధర్మాసనం కరీనాకు నోటీసులిచ్చింది. ఆ పదం వాడటానికి గల కారణాన్ని ప్రశ్నించింది.

నోటీసే కాదు, కరీనా కపూర్ పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోఫర్ పిటిషన్ వేశారు. పైగా ఆ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. పుస్తం శీర్షికలో ‘బైబిల్’ వాడడం వల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసినట్లవుతోందని పేర్కొన్నారు. బైబిల్ క్రైస్తవుల పవిత్ర గ్రంథం. కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్ తో ముడిపెట్టడం సరికాదని ఆయన వాదించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News