Thursday, December 19, 2024

సూర్య దంపతులపై ఎఫ్‌ఐఆర్‌కు కోర్టు ఆదేశం !

- Advertisement -
- Advertisement -

Surya

చెన్నై: తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన ‘ జైభీమ్’  వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని  వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

‘జై భీమ్‌’ లోని కొన్ని సన్నివేశాలు  తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతడి భార్య జ్యోతిక(జై భీమ్‌ నిర్మాత),  దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News