Thursday, January 9, 2025

న్యాయవాదుల సమక్షంలోనే విచారణ

- Advertisement -
- Advertisement -

చట్టపరమైన రక్షణ కల్పించాలని మళ్లీ హైకోర్టునే కోరుతా
న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం గతంలో కాంగ్రెస్
నేతలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే
వెళ్లారు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అణాపైసా
అవినీతి జరగలేదు గ్రీన్ కో కంపెనీ ఒక్క బిఆర్‌ఎస్‌కే
కాదు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకూ విరాళాలు ఇచ్చింది
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరమై న పోరాటం చేస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. న్యా యవాదుల సమక్షంలో తన విచారణ జరగాలని మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. తాను ఎసిబి విచారణకు వెళితే న్యాయవాదులతో రావొద్దని చెబుతున్నారని, విచారణకు న్యాయవాదులు రావద్దని ఎలా చెబుతారని ప్ర శ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని, చట్టపరమైన ర క్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. నందినగర్‌లోని త న నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

తమ పార్టీ నేత పట్నం నరేందర్‌రెడ్డి న్యాయవాదులు లేకుండా విచారణకు వెళితే ఇవ్వని స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు బుకాయించారని ఆరోపించారు. రాజకీయంగా కక్ష సాధింపు కేసు అని తెలిసినా కూడా ఎసిబి విచారణకు హాజరయ్యానని, కానీ ప్రభుత్వం తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు. ఎసిబి విచారణకు ఆఫీసుకు న్యాయవాదితో సహా హాజరవుతానని చెప్పానని, అరగంట వేచి చూసినా ఎసిబి అధికారులు తనను ప్రశ్నలు అడగడానికి వెనుకా ముందయ్యారని అన్నారు. ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని, వారు ఏమి అడిగినా సమాధానం చెబుతానని తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఫార్ములా ఈ -కారు కేసులో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని, హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టు ఆశ్రయించానని తెలిపారు. ఈ కేసులో తన న్యాయపోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

కొంతమంది మంత్రులే న్యాయమూర్తులు అయిపోతున్నారు
ఫార్ములా ఈ-కారు కేసులో ఏం జరగబోతుందో కొంతమంది మంత్రులు ముందే చెబుతున్నారని, వాళ్లే న్యాయమూర్తులు అయిపోతున్నారని కెటిఆర్ అన్నారు. విచారణ సచివాలయంలో జరగదని, మీడియాలో, మంత్రుల పేషీలోనో జరగదని, న్యాయస్థానాల్లోనే జరుగుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేతలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కోర్టుకే వెళ్లారని గుర్తు చేశారు.హైకోర్టు కేవలం క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేశారని, దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఏదో ఉరిశిక్ష వేసినట్టు నేరారోపణ జరిగినట్టు సంకలు గుద్దుకుంటున్నారని అన్నారు. తాను నేరం చేసినట్టు హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, తనకు శిక్ష వేయలేదని పేర్కొన్నారు. కనీసం స్కామ్ జరిగినట్టు కూడా ఎక్కడా అనలేదని తెలిపారు.

పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. అలాగే అవినీతిపరులకు అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకు పొలిటికల్ లోఫర్లకు ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారినట్టు అనిపిస్తుందని విమర్శించారు. ఏదో జరిగిపోయింది అన్నట్టు పొద్దున్నుంటి కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారని అన్నారు. తన మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, ఏమీ లేని లొట్టపీసు కేసు అని తెలిసినా ఎసిబి విచారణకు వెళ్లానని చెప్పారు. ఇది ఆరంగం మాత్రమే అని, మరో నాలుగేళ్లలో తమపై మరిన్ని కేసులు పెడతారని, అన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పారు. భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తనకు ఉన్న ప్రతి హక్కును వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి మగాడు అయితే మీడియా సమక్షంలో చర్చ పెట్టాలి
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అణాపైసా అవినీతి కూడా జరగలేదని కెటిఆర్ పునరుద్ఘాంచారు. తెలంగాణ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకపోయేందుకు, ప్రపంచపటంలో హైదరాబాద్‌ను విశ్వ నగరంగా చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ అని, ఇందులో ఏమీ ఆశించి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాదిరిగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ తమకు లేదని చెప్పారు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ అని, రేషంగళ్ళ తెలంగాణ బిడ్డగా ఏ విచారణను ఎదుర్కోడానికైనా తాను సిద్ధం అని తేల్చిచెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టమని తాము కోరితే ముఖ్యమంత్రి పారిపోయారని, రేవంత్ రెడ్డి మగాడు అయితే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెడితే మీడియా సమక్షంలో లైవ్‌లో తాను చర్చకు సిద్ధం అని, ఆ తర్వాత ఎసిబి విచారణకైనా జరిపించుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ నాయకుల ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ…మా ఇంట్రెస్ట్ ఫార్మర్
కాంగ్రెస్ నాయకుల ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ…తమ ఇంట్రెస్ట్ ఫార్మర్ అని కెటిఆర్ స్పష్టం చేశారు. తాము రైతు భరోసా గురించి మాట్లాడుతుంటే, డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తమకు తెలుసు అని పేర్కొన్నారు. విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం చేయడమే కాంగ్రెస్ నైజం అని చెప్పారు. రైతు భరోసా ఎప్పుడు వస్తుందని 75 లక్షల మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారని, కెసిఆర్ 12 సార్లు రైతుబంధు ఇస్తే ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు. ఈసారైనా ఇస్తాడా అని తెలంగాణ రైతులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని, వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలని తనను కలిసిన బిఆర్‌ఎస్ నాయకులకు చెప్పినట్లు పేర్కొన్నారు. పార్టీ నిర్మాణంపైన, 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ చూపుతున్న నిర్లక్ష్యంపై బిఆర్‌ఎస్ నేతలు దృష్టి పెట్టాలని సూచించానని చెప్పారు.

ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన 2500, వృద్ధులకు ఇవ్వాల్సిన 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు..? ఎలా ఇస్తారో..? చెప్పాలని కాంగ్రెస్ నాయకులను నిలదీద్దామని, అటెన్షన్ డైవర్షన్ తో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయాలని తమ నాయకులకు చెప్పానని వివరించారు. ఫార్ములా కేసు విషయంలో మీడియా చేస్తున్న హడావుడికి బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగం కావద్దని సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నాకు దక్కాల్సిన హక్కును తాను విధిగా వాడుకుంటానని తెలిపారు. తనకు భారత న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందని అన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పారు. బిజెపి కాంగ్రెస్ వేరు కాదు అని, రక్షణ కవచం లాగా కాంగ్రెస్‌కు బిజెపి పని చేస్తుందని ఆరోపించారు. రెండు పార్టీలు ఒకటికొకటి పెనవేసుకుని కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.

గ్రీన్ కో నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లు అందుకోని పార్టీ ఏదైనా ఉందా..?
గ్రీన్ కో కంపెనీ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లు అందుకోని రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా..? అని కెటిఆర్ ప్రశ్నించారు.ఒక బిఆర్‌ఎస్‌కే కాదు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలకు కూడా గ్రీన్ కో బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిందని తెలిపారు. ఒక్క టిఆర్‌ఎస్ పార్టీ మీదనే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఏడుస్తున్నారు ? మెగా ఇంజనీరింగ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిందని, క్విడ్ ప్రో కోలో భాగంగానే మెగా కంపెనీకి, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సిఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని అంటే ఎలా ఉంటుందని అడిగారు. క్విడ్ ప్రో కో అంటే అర్థం కాంగ్రెస్ నాయకులకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలుసా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన గ్రీన్ కో కు ప్రతిఫలంగా ఏం దక్కిందో నిరూపించగలరా..? అని అడిగారు.

4000 కోట్ల రూపాయల మల్లన్న సాగర్ పనులు కూడా మెగా ఇంజనీరింగ్‌కి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉందని, అది కూడా క్విడ్ ప్రో కోలో భాగంగానే ఇస్తున్నారా..? అని నిలదీశారు. మూసి ప్రాజెక్టు కూడా మెగాకే ఇచ్చారని, అది కూడా క్విడ్ ప్రో కోలో భాగంగానే ఇచ్చారా..? అని ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయాక మెగా ఇంజనీరింగ్‌ను బ్లాక్ చేయాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి ఇచ్చిన రిపోర్టును ఎందుకు రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని, మెగా ఇచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లకు ప్రతిఫలంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా..? అని నిలదీశారు. ఒక కాంట్రాక్టర్ మంత్రిగా ఉంటే ఇంకో బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ టాపింగ్, కాళేశ్వరం, జన్వాడ, హైడ్రా అంటూ ఏడాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News