Thursday, December 19, 2024

నటి కస్తూరికి రిమాండ్…జైలుకు తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనకే అంతా తెలుసునన్నట్లు పొగరుగా వ్యవహరించి, తెలుగువారిని కించపరచిన నటి కస్తూరికి కోర్టు నేడు రిమాండ్ విధించింది. ఎగ్మూర్  మెట్రోపాలిటన్ న్యాయస్థానం 12 రోజులపాటు ఆమెకు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆమెను పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. తీర్పు తర్వాత బయటకు వచ్చిన కస్తూరి ఏ మాత్రం తగ్గకుండా ‘‘అధికార దుర్వినియోగానికి ముగింపు పలకండి, న్యాయాన్ని గెలిపించండి’’ అంది. ఆమె హైదరాబాద్ శివారులోని ఓ సినీ నిర్మాత ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను నిన్ననే కస్టడీలోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News