Monday, January 20, 2025

కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తీవ్ర డయాబెటిస్‌తో బాధపడుతున్న తనకు ఇన్సులిన్ వేసుకోవడానికి అనుమతించడంతోపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి ప్రతిరోజు 15 నిమిషాలపాటు అనుమతించాలని కోరుతూ తీహార్ జైలులో జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 21న(సోమవారం) కోర్టు తన తీర్పును వెలువరించనున్నది. తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రవిచంద్ర రావును వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంప్రదించడానికి అనుమతించాలని, తన భార్య సునీత కూడా ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ తన పిటిషన్‌లో కోరారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వైద్యుల సర్యవేక్షణలో కేజ్రీవాల్ ఇన్సులిన్ వేసుకోవడం ప్రారంభించారని, అయితే ఇప్పుడు అది నిలిచిపోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్లూకోజ్ లెవల్స్ క్రమబద్ధీకరణకు వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపారు. అయితే మార్చి 21న అరెస్టు చేసిన తర్వాత నుంచి తాను ఇన్సులిన్ వేసుకోవడం ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ వేసుకోవడానికి అనుమించడం లేదంటూ ఆప్ మంత్రి అతిషి చేసిన ఆరోపణపై స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా తన వాస్తవ నివేదికను అందచేయాలని డైరెక్టర్ జనరల్ (కారాగారాలు)ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News