- Advertisement -
మధురై (తమిళనాడు ): శ్రీలంక నావికాదళం ఇటీవల అరెస్టు చేసిన తమిళ జాలర్ల విడుదలకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశించింది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు 68 మంది జాలర్లు అరెస్టు అయ్యారని వీరిని తిరిగి రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించాలని బుధవారం కోరింది. జాలర్ల విడుదల కోరుతూ తమిళనాడు మత్సకారులు గత కొన్నాళ్లుగా ఆందోళన సాగిస్తున్నారు. మత్సకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పాక్ జలసంధిలో భారత దేశానికి గల సంప్రదాయ చేపల వేట హక్కులను పరిరక్షించాలని , జాలర్ల జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -