Monday, November 18, 2024

ముగ్గురు నేతలకు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం ఎంఎల్‌ఎల వనమా
వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు
ఎంఎల్‌ఎగా జలగం వెంకట్రావు పేరు
ప్రకటన వనమాకు రూ. 5లక్షల ఫైన్
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్‌ను
తిరస్కరించిన హైకోర్టు ఎంపి బీబీ
పాటిల్‌కు సుప్రీంలో చుక్కెదురు

మన తెలంగాణ/సిటీబ్యూరో: తెలంగాణకు చెంది న ముగ్గురు రాజకీయ నాయకులకు కోర్టు మంగళవారం షాక్ ఇచ్చాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎ న్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో, ఎంపి బిబి పాటిల్‌కు సు ప్రీం కోర్టులో చుక్కెదురైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసేందుకు హై కో ర్టు నిరాకరించగా, ఎంపి బిబి పాటిల్ ఎన్నికల పై దాఖలైన పిటిషన్ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిం ది. 2018 ఎన్నికల్లో అఫిడవిట్‌లో ఆయన తప్పు డు సమాచారం ఇ చ్చారని అప్పుటి ప్ర త్యర్థి జలగంవెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రస్తుత ఎమ్మెల్యేగా జల గం వెంకట్రావును ప్రకటించింది. 2018లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున వనమా వెంకటేశ్వరరావు, టిఆర్‌ఎస్ తరఫున జలగం వెంట్రావు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

ఈ ఎన్నికలో వనమా వెం కటేశ్వరరావు విజయం సాధించారు. వనమా ఎ న్నికను సవాల్ చేస్తూ జలగం వెంక్రటావు హైకోర్టు ను ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పు డు సమాచా రం ఇచ్చారంటూ పిటిషన్ దాఖలు చే శారు. వన మా, అతడి భార్య పేరు మీద ఉన్న ఆస్తు లు,అప్పులను చూపించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని కో రారు. సు దీర్ఘ విచారణ చేసిన కోర్టు జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. వనమా ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది, కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని రూ.5లక్షల జరిమానా విధించింది. ఎన్నికల అనంతరం వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ను వీడి బిఆర్‌ఎస్‌లో చేరారు, ప్రస్తుతం ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు.

మంత్రి, ఎంపికి చుక్కెదురు…

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ ఎన్నిక చెల్లదని 2019లో రాఘవేంద్రరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్‌లో దాచిపెట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్ తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలను పరిశీలించాలని గతంలో పిటిషన్‌ను సుప్రీంకోర్టు, హైకోర్టుకు పంపించింది. ఇవాళ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

పిటిషన్‌పై విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. కాగా బిఆర్‌ఎస్ ఎంపి బిబి పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అనర్హత పిటిషన్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ బిబి పాటిల్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థిగా జహీరాబాద్ నుంచి బిబి పాటిల్ గెలుపొందారు. అయితే నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడినందున బిబి పాటిల్ ఎన్నిక చెల్లదని కె. మదన్‌మోహన్ రావు అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రోజు వారి విచారణకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను బిబి పాటిల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బిఆర్‌ఎస్ ఎంపి పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా బిబి పాటిల్ వాదనల్లో మెరిట్స్ లేనందున పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News