Monday, December 23, 2024

జూన్ 2 నుంచి 33 జిల్లాల్లో కోర్టులు

- Advertisement -
- Advertisement -

Courts in 33 districts from June 2

గెజిట్ నోటిఫికేషన్ జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఏర్పాటు చేసిన కొత్త కోర్టులు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి పెండింగ్ కేసుల వివరాలను ఈనెల 24లోపు పంపాలని రిజిస్ట్రార్ సుజన గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 33 జ్యుడిషియల్ జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కోర్టుల పరిధి ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొత్త జిల్లా కోర్టుల వారీగా కేసులు విభజించాలని జడ్జీలకు హైకోర్టు రిజిస్ట్రార్ జిల్లా జడ్జీలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి ఏర్పాటైన 33 రెవెన్యూ జిల్లాలలోని కొత్త జిల్లా కోర్టులు వచ్చేనెల 2నుంచి సేవలందించనున్నాయని రిజిస్ట్రార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News