Monday, December 23, 2024

గడువుకు ముందే కాలం చెల్లిపోతున్న 50 మిలియన్ కొవాగ్జిన్ డోసులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : వచ్చే సంవత్సరం రాకముందే భారత్ బయోటెక్‌కు చెందిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ 50 మిలియన్ డోసులు కాలం చెల్లిపోతున్నాయి. డిమాండ్ బాగా తగ్గిపోయి తీసుకునేవారు ఎవరూ లేకపోవడమే దీనికి కారణంగా ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 2021 సంవత్సరాంతానికి ఏటా ఒక బిలియన్ డోసుల ఉత్పత్తి సాధించే సామర్ధం ఈ సంస్థకు ఉన్నప్పటికీ, డిమాండ్ తగ్గిపోవడంతో ఈ ఏడాది ప్రారంభం లోనే ఉత్పత్తిని ఆపేశారు. భారత్ బయోటెక్ సంస్థకు గుత్తగోలుగా 200 మిలియన్ కన్నా ఎక్కువ డోసులు ఉత్పత్తి నిల్వలు ఉన్నప్పటికీ, వాటిలో దాదాపు 50 మిలియన్ డోసులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఉత్పత్తికి డిమాండ్ లోపించడంతో ఈ ఏడాది మొదట్లోనే అనేక నెలల క్రితం కొవాగ్జిన్ ఉత్పత్తిని ఆపేశారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. 2023 సంవత్సరానికి ముందే కొవాగ్జిన్ డోసులు గడువు తీరి పోతున్నాయని, ఫలితంగా కంపెనీకి నష్టాలు ఎదురయ్యాయని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవడమో తెలియడం లేదని పేర్కొన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News