- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసి న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కరోనా వైరస్‌పై 77.8 శాతం సమర్ధంగా పనిచేస్తున్నట్టు మూడోదశ ప్ర యోగాల్లో తేలిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని భారత్ బయోటెక్ గత వారం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ)కు సమర్పించింది. దీనిపై నిపుణుల కమిటీ ఆ వివరాలను సమీక్షించింది. వైరస్‌పై 77.8 శాతం ప్రభావం కనిపించినట్టు తెలిపింది. అయితే దీనినపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. భారత్ బయోటెక్ ఇప్పటికే రెండు సార్లు ఫేజ్ 3 ట్రయ ల్ మధ్యంతర పరిశీలన ఫలితాలను ప్రకటించింది. తొలి మధ్యంతర ఫలితాల్లో 81 శాతం, రెండో మధ్యంతర పరిశీలన ఫలితాల్లో 78 శా తం ప్రభావం కనిపించినట్టు వెల్లడించింది.
- Advertisement -