Saturday, November 23, 2024

కోవర్టు ఆపరేషన్ సక్సెస్

- Advertisement -
- Advertisement -

ప్రతికూల పరిస్థితులను అధిగమించి టికెట్ సాధించి గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన అభ్యర్థులను కోవర్టు భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇలాంటి కోవర్టు వ్యవస్థ పటిష్టంగా ఉంది. అర్బన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌లలోనే త్రిముఖ పోటీ ఉంది. మిగితా సెగ్మెంట్‌లలో బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్యే హోరాహోరీ పోరు ఉంది. గత ఎన్నికల్లో తమకు కోవర్టులుగా పని చేసిన నేతలనే ఈసారి కూడా ఎంగేజ్ చేసుకున్నారు. అందుకే ప్రత్యర్థుల కీలక సమాచారం అభ్యర్థులకు క్షణాల్లో వచ్చేస్తుంది.

ఇటీవల నిజామాబాద్ అర్బన్‌లోని పద్మశాలి సంఘం నేత జాతీయ పార్టీ అభ్యర్థితో డీల్ సెట్ చేసుకున్నాడు. నగదు చేతికి అందేలోపే ఆ సమాచారం లీక్ అయింది. ఆ కుల పెద్దల్లో రచ్చ జరిగింది. నిజానికి ఈ సమాచారం బయటికి ఎలా పొక్కిందనేది సదరు అభ్యర్థికి అంతు చిక్కలేదు. దీనితో ఓ రెండు రోజులు కీలక యువనేతను దూరం పెట్టేశారు. నిజానికి గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్న అభ్యర్థులకు కీలక వ్యవహరాలు బయటికి పొక్కడంతో రగిలిపోతున్నారు. ఇలా అభ్యర్థుల చేస్తున్న కార్యక్రమాలను ముందే ప్రత్యర్థులకు తెలుస్తుండటంతో ఎవరు కోవర్టో, ఎవరూ నమ్మిన వారే అర్థంకాక మదనపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News