Thursday, January 23, 2025

14,241కి పెరిగిన యాక్టివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Covid-19 Active cases increased to 14241

మూడో రోజూ 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు రికవరీలకన్నా కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గురువారం 4.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,451 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజుకంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 965 కేసులు రాగా, కేరళ, హర్యానాలలో 300 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.

24 గంటల వ్యవధిలో 54 మంది మృత్యువాత పడ్డారు. అందులో కేరళ ప్రకటించిన మృతుల సంఖ్య 48. ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడగా 5.22 లక్షల మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా గత కొన్ని రోజులుగా రికవరీలకన్నా కొత్త కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. గురువారం 1,589 మంది కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 14,241కి చేరుకుంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. కాగా గురువారం నాడు కొత్తగా 18 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News