Friday, November 22, 2024

9 నెలల కనిష్ఠానికి భారీగా తగ్గిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Covid-19 cases greatly reduced to 9 month low

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు 9 వేలకు దిగువన 9 నెలల కనిష్ఠానికి చేరాయి. మరోవైపు మరణాలు కూడా 200 లోపే ఉండడం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం 11,07,517 కరోనా పరీక్షలు చేయగా, 8865 కేసులు బయటపడ్డాయి. 287 రోజుల కనిష్ఠానికి ఇవి చేరుకున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ రాష్ట్రం నుంచే 4547 కేసులు, 57 మరణాలు ఉన్నాయి. సోమవారం కరోనాతో చికిత్స పొందుతూ 197 మంది మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,63,852 కు చేరింది. గత కొన్ని రోజులుగా రికవరీలు కూడా మెరుగ్గానే ఉంటున్నాయి. సోమవారం ఒక్క రోజే 11,971 మంది కరోనాను జయించారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి ఆ రేటు 98.27 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,30,793 కి తగ్గి, ఆ రేటు 0.38 శాతానికి పడి పోయింది. ఇవి 525 రోజుల కనిష్ఠానికి చేరాయి. ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సోమవారం ఒక్క రోజే 59,75,469 మందికి టీకాలు అందాయి. దీంతో మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,12,97,84,045 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసిన ఆస్ట్రాజెనెకా టీకాల సంఖ్య 2 బిలియన్ల డోసుల మైలురాయిని చేరుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News