- Advertisement -
బెంగళూరు: కర్నాటకలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మరణాలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరు సిటీలో పరిస్థితి దారుణంగా తయారైంది. నగర పరిధిలోని ఐదు స్మశానవాటికలో అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రతిరోజు 50పైగా మృతదేహాలు ఖననానికి వస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అంత్యక్రియలకు గంటల తరబడి స్మశానం వద్ద క్యూలైన్లో వేచిచూడాల్సి వస్తుంది. కర్నాటకలో ఏప్రిల్ 15 సాయంత్రం నాటికి, మొత్తం 11,09,650 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. ఇందులో 13,112 మరణాలు, 9,99,958 డిశ్చార్జెస్ ఉన్నాయి. అటు దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కోనసాగుతోంది. గడిచిన 24గంటల్లోనే 2,34,692 మంది కరోనా సోకింది.1,341 మంది కరోనాతో చనిపోయారు.
Covid-19 cases increase in karnataka
- Advertisement -