- Advertisement -
జెనీవా: వరుసగా ఐదోవారం యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) తెలిపింది. ఈ వారం కొత్త కేసులు దాదాపు 30 లక్షలు లేదా 6 శాతం అధికంగా నమోదయ్యాయి. గతవారం 18 శాతం అదనంగా నమోదయ్యాయని డబ్లూహెచ్‌ఒ పేర్కొన్నది. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గింది లేదా అదేతీరున ఉన్నదని డబ్లూహెచ్‌ఒ తెలిపింది. మధ్య ప్రాచ్యంలో 12 శాతం తగ్గగా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాల్లో 9 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 8 శాతం పెరిగింది. మరణాల సంఖ్య అత్యధికంగా ఆగ్నేయాసియా ప్రాంతంలో 50 శాతంమేర పెరగడం గమనార్హం. ఇన్‌ఫెక్షన్ రేట్ యూరప్‌లో అత్యధికంగా లక్ష జనాభాకు 192 చొప్పున, ఆ తర్వాత స్థానంలో అమెరికాలో లక్షకు 72 కొత్త కేసులు నమోదయ్యాయి.
- Advertisement -