Saturday, November 23, 2024

ఆగని కొవిడ్ మృత్యుఘోష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి అనంతరం ఆకస్మిక మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో ఈ మరణాల రేటు ఎక్కువగా ఉంటున్న ది. 6.5 శాతం మంది రోగులు కొవి డ్ చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏడాదిలోను మృత్యువాతపడినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ విభాగానికి చెందిన నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ ఫర్ కొవిడ్ 19(ఎన్‌సిఆర్‌బి) అధ్యయనంలో తేలింది. అందులో 18.6 శాతం మంది 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మ ధ్య వయసు గల వారే ఉన్నారు. కొవిడ్ చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 14,419 మందిలో 616 మంది పురుషులు, 325 మంది మహిళలు మరణించినట్లు అధ్యయనం లో వెల్లడైంది.

2020 సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి 2023 వరకు కొవిడ్ చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి డాటాను ఎన్‌సిఆర్‌బి సేకరించి, ఒక సంవత్సరంలో పోస్ట్-డి శ్చార్జ్ మరణాలకు సంబంధించిన కారకాలను అంచనా వేసింది. 18 ఏళ్ల కంటే తక్కు వ వయస్సు ఉన్నవారు డిశ్చార్జ్ అయిన త ర్వాత ఒక సంవత్సరంలో చనిపోయే అవకాశం 1.7 శాతం రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌కు ముందు కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అ యిన తర్వాత మరణాల నుంచి 60 శాతం రక్షణను అందించిందని అధ్యయనం తెలిపింది. గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు కొవిడ్ తర్వాత మరణాలకు ప్రదాన కారణంగా ఈ అధ్యయనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News