Friday, November 22, 2024

అమెరికాలో మరోసారి లక్షకుపైగా కేసులు

- Advertisement -
- Advertisement -
Covid-19 in america more than one lakh cases
దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ వ్యాక్సినేషన్, డెల్టా వేరియంట్ వల్లే..

ఫోర్ట్‌లాడర్డేల్: మరోసారి అమెరికాలో కోవిడ్-19 కేసులు లక్షమార్క్‌ను దాటాయి. శనివారం 1,07,143 కేసులు నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరగడం, డెల్టా వేరియంట్ వల్ల కేసులు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని వారు సూచించారు. లేదంటే కేసులు పెరిగి, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అమెరికాలోని 50 శాతం వృద్ధులకు రెండు డోసుల టీకా అందించారు. 70 శాతంకుపైగా కనీసం ఒక్క డోసు తీసుకున్నారు.

మా నమూనా ప్రకారం వ్యాక్సినేషన్ వేగం పుంజుకోకపోతే కేసులు జనవరిలో వలె లక్షల్లో నమోదవుతాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రోచెల్లేవాలెన్‌స్కీ అన్నారు. గతేడాది నవంబర్‌లో రోజుకు సగటున లక్ష కేసులు నమోదు కాగా, జనవరిలో 2,50,000కు చేరాయి. జూన్‌లో తగ్గుముఖం పట్టి రోజుకు సగటున 11,000కు పడిపోయాయి. ఆరు వారాల్లో మరోసారి లక్షమార్క్ దాటడంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. రెండు వారాల క్రితం రోజువారీ మరణాల సగటు 270 ఉండగా, శుక్రవారం ఆ సంఖ్య 500కు చేరింది. జనవరిలో అత్యధికంగా ఒక్కరోజే 3500 మరణాలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News