39 మరణాలు నమోదయ్యాయి
న్యూఢిల్లీ: ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కొత్త కేసులు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలో యాక్టివ్ కేసేలోడ్ కూడా నాలుగు నెలల తర్వాత 1-లక్ష మార్కును అధిగమించి 1,04,555కి చేరుకుంది. ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 197.61 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
24 గంటల్లో దేశంలో కొత్తగా 18,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో 39 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 13,827 మంది కోలుకున్నారు. అయితే, రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.16 శాతానికి పెరిగింది.
#COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours.
Active cases 1,04,555
Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr— ANI (@ANI) June 30, 2022