న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 అంత్యదశకు చేరుకున్నదని ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్, వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ గంగాదీప్ క్యాంగ్ స్పష్టం చేశారు. ప్రజలు వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకున్నారని ఆమె అన్నారు. ఇది అంటువ్యాధి దశకన్నా పూర్తిగా భిన్నమైనదని ఆమె అన్నారు. రెండో వేవ్ తర్వాత దేశంలోని నాలుగోవంతు ప్రజలకు వైరస్ తాకి ఉంటుందని ఆమె అన్నారు. ఓవేళ పండుగల సీజన్‌లో ప్రజల ప్రవర్తనలో మార్పు వస్తే స్థానికంగా కొన్ని చోట్ల ఉన్న వైరస్ దేశవ్యాప్తంగా ఓమేర విస్తరిస్తుందని.. అయితే, సెకండ్‌వేవ్‌లో వలె థర్డ్‌వేవ్ ప్రభావం చూపబోదని ఆమె అన్నారు. కొవిడ్19 ఒక్కటే మహమ్మారి కాదని, గతంలో ఇన్‌ఫ్లుయెంజాలాంటి మహమ్మారులు వచ్చి అంత్యదశకు చేరుకున్నాయని ఆమె గుర్తు చేశారు. ఓవేళ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తే వాటిని ఎదుర్కొనేలా ఇమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి మెరుగైన వ్యాక్సిన్లను రూపొందించాలని ఆమె సూచించారు.
కొవిడ్19 దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ 18 నెలల్లో వైద్య సౌకర్యాలన్నీ అటువైపే మళ్లించాల్సి వచ్చిందని ఆమె అన్నారు. కరోనా వల్ల చాలా రాష్ట్రాల్లో మాతా, శిశు మరణాలు పెరిగాయని, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని, మథుమేహం బాధితులకు మందులు సరీగ్గా అందించలేకపోయారని, ఇతర వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిలిచిపోయాయని, టిబి నియంత్రణ కార్యక్రమాలపైనా ప్రతికూల ప్రభావం చూపిందని ఆమె తెలిపారు. జరిగిన నష్టం నుంచి హేతువాద దృక్పథం అలవరచుకోవాలని ఆమె సూచించారు. ఇక ముందు అలాంటివి వస్తే ఎదుర్కొనేలా హెల్త్‌కేర్‌ను మెరుగుపరచుకోవాలన్నారు.
Covid 19 reached to End says Prof Dr Gagandeep Kang