న్యూఢిల్లీ : దేశంలో కరోనా అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 30,757 కరోనా కేసులు రాగా, 541 మరణాలు సంభవించాయి. ఈమేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. 11 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 30 వేల మందికి పైగా పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉంది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటులో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు 4.27 కోట్ల మందికి కరోనా సోకగా, అందులో 4.19 కోట్ల మంది వైరస్‌ను జయించారు. బుధవారం ఒక్క రోజే 67 వేల మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.03 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు 3.3 లక్షల (0.78 శాతం) కు దిగివచ్చాయి. 5,10,413 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 174 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
98 శాతానికి చేరిన రికవరీ రేటు
- Advertisement -
- Advertisement -
- Advertisement -