Wednesday, January 22, 2025

వ్యాక్సిన్‌కు టీనేజర్ల ఆసక్తి….

- Advertisement -
- Advertisement -
covid-19 vaccination for teenagers
పలు విద్యాసంస్దలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు
సెలవులు ప్రకటించడంతో టీకా తీసుకుంటున్న విద్యార్థులు
ఇప్పటివరకు 45శాతం మంది తీసుకున్నట్లు వైద్యశాఖ వెల్లడి

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో టీనేజర్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ప్రారంభించిన మూడు నాలుగు రోజుల వరకు విద్యార్థులు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. తాజాగా సెలవులు ప్రకటించడంతో చాలామంది గ్రామాలకు వెళ్లుతుండటంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు కళాశాల నిర్వహకులు పేర్కొంటున్నారు. మరోపక్క కరోనా విజృంభణ చేసి రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో టీకా తీసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిన ఎదుర్కొనే అవకాశముందని త్వరగా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. విద్యాసంస్దలో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించడంపై వైద్యశాఖ అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్రాంతి పండగలోగా టీనేజర్లు వ్యాక్సిన్ వందశాతం పూర్తి అవుతుందని, గత రెండు రోజులుగా వ్యాక్సిన్ తీసుకునేందుకు 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు ముందుకు రావడంతో పలు కేంద్రాలు రద్దీగా మారినట్లు స్దానిక వైద్యాధికారులు చెబుతున్నారు.

జీహెచ్‌ఎంసీ మూడు జిల్లాల పరిధిలో 5,27, 542 మంది టీనేజర్లను వ్యాక్సిన్ పంపిణీ కోసం గుర్తించినట్లు తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి టీకా పంపిణీ చేస్తుండగా ఇప్పటివరకు 45 శాతం మంది తీసుకున్నట్లు నగరంలో సహా 12 కార్పొరేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా వేస్తున్నట్లు, కేంద్రాల్లో గుంపులుగా ఉండగా జాగ్రత్తలో భాగంగా ఈవిధానం తీసుకొచ్చినట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాల అధ్యాపకులు, కార్పొరేట్లు విద్యాసంస్దలు విద్యార్ధులు టీకా తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు సెంటర్ల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆరగంట పాటు కేంద్రాల్లో ఉండాలన్నారు. మొదటి డోసు వేసుకున్న తరువాత 28 రోజులకు రెండో డోసు తప్పకుండా వేసుకోవాలన్నారు.

టైపాయిడ్ ఇతర జబ్బుల బారినపడి ఏఆర్వీ తదితర వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆతేదీ నుంచి నాలుగు వారాల తరువాత కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,84,822మందిని గుర్తించగా ఇప్పటివరకు 56909 మంది తీసుకున్నట్లు, రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మందిని గుర్తించగా 37420 మంది, మేడ్చల్ జిల్లాలో 1,65,618 మందిని గుర్తించగా 50019 మంది టీకా తీసుకున్నట్లు, ఒక్కొక్క జిల్లాలో 45 శాతంకు పైగా తీసుకున్నట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నారు. మిగతా వారందరికి వారం రోజుల్లో పూర్తి చేస్తామని, విద్యాసంస్దలు బాధ్యత తీసుకుని టీకా పంపిణీ పూర్తి అయ్యేవరకు బాధ్యత తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News