Friday, November 22, 2024

12-14 ఏళ్ల వారికి కరోనా టీకా..

- Advertisement -
- Advertisement -

Covid-19 vaccine for 12 to 14 year olds

న్యూఢిల్లీ : కేంద్రం మార్చి 16 నుంచి కరోనా టీకా కార్యక్రమంలో మరో దశను ప్రారంభించనున్నది. 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకా ఇవ్వనుంది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను ఈ వయస్సు వారికి అందించనున్నది. ఈ టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా 12 ఏళ్లు పైబడిన వారు రేపటి నుంచి కొవిన్ ప్లాట్‌ఫాంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.

1. ఇందుకోసం www.cowin.gov.in లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. తర్వాత అందులో register yourself అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మొబైల్ నంబరు రాస్తే మొబైల్ ఫోన్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
2. ఆ ఓటిపిని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్తుంది. అక్కడ మీ పేరు , వయసు, పుట్టిన తేదీ, వంటి వివరాలు ఎంటర్ చేయాలి. దీంతో పాటు ఏదో ఒక ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డులు అందుబాటులో లేని పక్షంలో పిల్లలు తమ విద్యార్థి ఐడీ కార్డులను ఉపయోగించవచ్చు.
3. పిల్లలు వారి కుటుంబ సభ్యులతో లేదా విడిగా నమోదు చేసుకోవచ్చు. ఒక కుటుంబం లోని నలుగురు సభ్యులు ఒక మొబైల్ నంబర్‌తో నమోదు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
4. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ‘ shedule appointment ’ అని బటన్ క్లిక్ చేస్తే అపాయింట్‌మెంట్ పేజీకి వెళ్తుంది. అక్కడ రాష్ట్రం , జిల్లా, పిన్‌కోడ్ ఎంటర్ చేసి మీ సమీపం లోని టీకా పంపిణీ కేంద్రాలను తెలుసుకోవచ్చు. ఆ జాబితా నుంచి ఒక కేంద్రాన్ని ఎంచుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్ చూపిస్తుంది. వాటిలో నుంచి సమయం, తేదీని ఎంచుకుని కింద ఉండే book బటన్‌ను క్లిక్ చేస్తే అపాయంట్‌మెంట్ లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News