Saturday, November 23, 2024

భారత్‌లో కోవిడ్ టీకాపై విముఖత తక్కువే

- Advertisement -
- Advertisement -
Covid-19 vaccine hesitancy in India at lowest level
లోకల్ సర్కిల్స్ ఆన్‌లైన్ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్ టీకా తీసుకోవడంలో విముఖత తక్కువ స్థాయి లోనే ఉందని, కేవలం ఏడు శాతం మంది వయోజనులే ఈమేరకు వెనుకాడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌పారమ్ లోకల్ సర్కిల్స్ ద్వారా ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో లోకల్ సర్కిల్స్ ప్రజల నుంచి 301 జిల్లాల నుంచి 12,810 స్పందనలు గ్రహించ గలిగారు. వీరిలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు. వ్యాక్సిన్ తీసుకోని వారి నుంచి వారెందుకు టీకా తీసుకోవడం లేదో , టీకా పొందడానికి వారి ప్లానేమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారు. అధ్యయనంలో స్పందనలు అందించిన వారిలో 42 శాతం టైర్ 1, 22 శాతం టైర్ 2, 31 శాతం టైర్ 3,  గ్రామీణ జిల్లాలకు చెందిన వారు. భారత్‌లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా, వీరిలో 68 కోట్ల మంది ఈపాటికే కనీసం టీకా ఒక డోసు తీసుకున్నారు.

ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేని వారిలో 46 శాతం మంది త్వరలో మొదటి డోసు తీసుకోవాలని ప్లాను చేస్తున్నారని లోకల్ సర్కిల్స్ సంస్థాపకులు సచిన టపారియా చెప్పారు. ఇంకా 27 శాతం మంది ఇప్పటికీ టీకా తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు వాడుకలో ఉన్న టీకాల వల్ల కరోనా నుంచి రక్షణ కలుగుతుందని, అలాగే భవిష్యత్తులో వచ్చే వేరియంట్ల నుంచి కూడా రక్షణ లభిస్తుందని ఎవరూ వారిని ఒప్పించలేకపోవడమే కారణమౌతోందని టపారియా వెల్లడించారు. ఈ 27 శాతం జనాభాను వ్యాక్సిన్‌కు విముఖత చూపించే కేటగిరి కిందకు వస్తారని చెప్పారు. వ్యాక్సిన్‌కు సంబంధించి తగిన సమాచారం ఎక్కువగా లభిస్తే అలాగే వివిధ రకాల టీకాలు అందుబాటు లోకి వస్తే ఈ 27 శాతం మంది టీకా తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశం లోని వయోజనులందరినీ సర్వేలో తీసుకుంటే కేవలం 7 శాతం మందే టీకాకు విముఖత చూపుతున్నట్టు తేలుతుందని చెప్పారు. ఈ శాతాలన్నీ వ్యాక్సిన్ తీసుకోని 26 కోట్ల వయోజనులకు వర్తింప చేస్తే ఇంకా 7 కోట్ల మంది టీకా తీసుకోడానికి వెనుకాడుతున్నట్టు తెలుస్తుందని టపారియా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News