Monday, November 18, 2024

టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరిక తప్పినట్లే

- Advertisement -
- Advertisement -

Covid-19 vaccines reduce hospital admissions: ICMR study

ఐసిఎంఆర్ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: ఆస్పత్రిలో రాల్సిన పరిస్థితిని, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు గణనీయమైన పనితీరును చూపాయని భారత వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్ పాజిటివ్ వచ్చిన వారిపై ఐసిఎంఆర్ ఓ అధ్యయనం నిర్వహించింది. కొవిడ్ రెండో దశ ఉధృతి సమయంలో (ఈ ఏడాది ఏప్రిల్‌జూన్ మధ్య కాలంలో) నిర్వహించిన ఈ అధ్యయనం దేశంలోనే మొట్ట మొదటిది. అంతేకాదు అతి పెద్దది కూడా. ఈ పరిశోధన సందర్భంగా ఆ సంస్థ అనేక విషయాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా మొత్తం 677 మంది కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించగా 80 శాతం మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారని తెలిపింది.

అధ్యయనంలో వెల్లడైన ప్రధాన విషయాలు

ఇప్పటికే ఒకటి లేదా రెండు డోసుల టీకా తీసుకున్న అనంతరం కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసిఎంఆర్ ఈ అధ్యయనం నిర్వహించింది. వారినుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది. వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించగా అందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ( బి.1.617.2)ను గుర్తించింది. ఆ మొత్తం కేసుల్లో 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. 0.4 శాతం మరణాలు సంభవించాయి. దీనిని బట్టి టీకా తీసుకోవడం వల్ల ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితి, మరణాలు తగ్గుతున్నాయని అధ్యయనం వ్లెల్డించింది.

ఇక వీరిలో 482 మందికి (71 శాతం) లక్షణాలు కనిపించగా, మిగతా 29 శాతం మందికి లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్న వారు.. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాసతీసుకోలేక పోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారినుంచి శాంపిల్స్ సేకరించగా, వీరిలో రెండు డోసులు తీసుకున్న వారు 592 మంది ఉండగా, ఒక డోసు తీసుకున్న వారు 85 మంది ఉన్నారని ఆ అధ్యయనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News