Thursday, January 23, 2025

వైద్యులను వణికిస్తున్న వైరస్

- Advertisement -
- Advertisement -
Covid-19 virus that is plaguing doctors
ఆసుపత్రుల్లో రోగుల సేవలకు వైద్య సిబ్బంది వెనకడుగు
మూడు రోజులుగా పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులకు సోకిన మహమ్మారి
సకాలంలో కరోనా రోగులకు అందని వైద్య చికిత్స
సేవల కోసం వైద్యశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగం

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతూ సామాన్య ప్రజలకే కాకుండా రోగులకు చికిత్సనందించే వైద్య సిబ్బందిని సైతం వదలడంలేదు. గత పది రోజుల నుంచి గ్రేటర్‌లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైతున్నాయి. దీంతో వైద్యశాఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే సీనియర్ వైద్యులు, జూనియర్ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్, వార్డుబాయ్‌లు సెలవులు పెట్టకుండా మహమ్మారి తగ్గుముఖం పట్టేవరకు సేవలందించాలని ఆదేశించింది. అప్పటినుంచి వైద్యసిబ్బంది కరోనా రోగులకు నాణ్యమైన సేవలందిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఊహించని విధంగా వైరస్ వందలాది మంది వైద్యులకు సోకడంతో వణికిపోతున్నారు. మొదటి, సెకండ్ వేవ్‌లో వైద్య సిబ్బంది కరోనా పెద్దగా సోకలేదు. కానీ థర్డ్‌వేవ్‌లో వైరస్ రెచ్చిపోతూ వైద్యుల భయాందోళనకు గురిచేస్తుంది.

వైద్యాధికారులు గణాంకాల ప్రకారం ఉస్మానియా ఆసుపత్రిలో 175 మందికి, ఉస్మానియా మెడికల్ కళాశాల్లో 45మంది, గాంధీ 120మంది, ఈఎన్‌టి ఆసుపత్రిలో 24మందికి, చెస్ట్ హాస్పటిల్ 10 మందికి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో 08మందికి, నీలోఫర్‌లో 17మందికి సిబ్బందికి వైరస్ సోకినట్లు పేర్కొంటున్నారు. వీరికి ఆయా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు కేటాయించి వైద్యం అందిస్తున్నారు. మహమ్మారి బారినపడిన సిబ్బంది వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండే వెసులుబాటు కల్పించడంతో రోగులకు సేవలందించడంలో ఆలస్యమైతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బంది అదనంగా విధులు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. వైరస్ ఇంకా విశ్వరూపం దాల్చే ప్రమాదముందని, అప్పటివరకు జాగ్రత్తలు పాటించడమే నివారణకు మార్గమని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖలోని పలువురు అధికారులకు కూడా వైరస్ సోకినట్లు తెలిసింది.

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,బస్తీదవఖానల్లో విధులు నిర్వహించే వైద్యులు, నర్సులు కూడా వైరస్ ప్రభావానికి ఎక్కువ గంటలు పనిచేయలేమని వెల్లడిస్తున్నారు. ఆరోగ్య కేంద్రాలకు స్దానిక ప్రజలు గుంపులుగా రావడంతో వారిని కోవిడ్ నిబంధనలు పాటించాలని క్యూ లైన్‌లో ఉంచడంతో వారి ద్వారా తమకు కూడా వైరస్ వస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సిబ్బందికి వైరస్ సోకడంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న నగర ప్రజలు మార్కెట్లు, దుకాణాలు, రోడ్లపై విచ్చిలవిడిగా తిరుగుతున్నారని, వీరిలో లక్షణాలున్న పట్టించుకోవడంలేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం జనసంచారం తగ్గే విధంగా చర్యలు తీసుకుంటే కొంతవరకు వైరస్ వేగానికి కళ్లెం వేయవచ్చని భావిస్తున్నారు. మాస్కులు ధరించకుంటే జరిమానాలు వేస్తున్న పెడచెవిన పెడుతున్నారని, కొద్ది రోజుల పాటు లాక్‌డౌన్ పెడితే నెల రోజుల్లో వైరస్ అదుపులో ఉంటుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News