Thursday, January 23, 2025

గుజరాత్ లో 67 ఏళ్ల రోగిలో కొవిడ్-19 ఎక్స్ వేరియంట్

- Advertisement -
- Advertisement -

X variant

ముంబయి నుంచి వడోదరకు ప్రయాణించిన వ్యక్తిలో కరోనా ఎక్స్ వేరియంట్ పాజిటివ్!

అహ్మదాబాద్:  కొవిడ్-19 ఎక్స్ వేరియంట్ పాజిటివ్ కనుగొనడంతో మహారాష్ట్ర, గుజరాత్‌లో శనివారం భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ముంబయి నుంచి వడోదరకు వచ్చి హోటల్‌లో బసచేసిన 67 ఏళ్ల వ్యక్తిని మార్చి 12న పరీక్షించగా అతడిలో పాజిటివ్ కనుగొనబడిందని గుజరాత్ ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ తెలిపారు. ‘12 రోజుల ముందు గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఎక్స్‌ఇ వేరియంట్‌ను ఆ రోగిలో కనుగొన్నది. ఐఎన్‌ఎస్‌ఎసిఒజి మార్గదర్శకాల ప్రకారం శాంపిల్స్‌ను కళ్యాణిలోని కోల్‌కతా లాబరేటరీ(డిబిటి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్(ఎన్‌ఐబిఎంజి)కి పంపారు. ఎక్స్‌ఇ వేరియంట్ ధృవీకరణ రిపోర్టు శుక్రవారం రాత్రి అందింది. మేము ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరెవరితో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాడని పరిశీలిస్తున్నాం’ అని మనోజ్ అగర్వాల్ తెలిపారు.
మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దేవేశ్ పటేల్ విలేకరితో మాట్లాడుతూ ‘67 ఏళ్ల రోగి తన భార్యతో పాటు ముంబయి నుంచి వడోదరా వచ్చాడు. వారు హోటల్‌లో దిగాక అతడిలో జ్వరం లక్షణాలు కనిపించాయి. వారు కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ ఫలితం రాగానే వారు ముంబయికి తిరిగి వెళ్లిపోయారు. వారు ప్రస్తుతం కట్టుదిట్టమైన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వారు వడోదరాలో ఎవరినీ కలువలేదు’ అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News