Sunday, December 22, 2024

భారత్‌లో థర్డ్ వేవ్ మొదలైనట్టే..

- Advertisement -
- Advertisement -

భారత్‌లో థర్డ్ వేవ్ మొదలైనట్టే
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోఢా
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ప్రధాన నగరాల్లో బయటపడుతోన్న పాజిటివ్ కేసులను విశ్లేషిస్తే వాటిలో ఎక్కువగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి. ఇలా గత వారం రోజులుగా కొవిడ్ కేసుల్లో భారీ పెరుగుదలను చూస్తుంటే దేశంలో మహమ్మారి మూడోవేవ్‌ను సూచిస్తోందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన అనేక వివరాలు తెలియచేశారు. అయినప్పటికీ భయాందోళనకు గురి కావలసిన అవసరం లేదన్నారు. ఇప్పటికే దేశంలో 80 శాతం మంది సహజం గానే వైరస్‌కు గురయ్యారని, దీనికి తోడు 90 శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారని, 65 శాతం మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందిందని వివరించారు.

దక్షిణాఫ్రికాలో విస్తృత వేగంతో వ్యాపిస్తూ విజృంభించిన ఒమిక్రాన్ వేవ్‌ను పరిశీలిస్తే రెండు వారాల తరువాత కేసుల్లో తగ్గుదల కనిపించిందని చెప్పారు. అందులోనూ ఎక్కువగా లక్షణాలు లేని స్వల్ప అనారోగ్యం, ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా తక్కువగానే కనిపించిందన్నారు. ఈ అంశాలన్నీ దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి త్వరలోనే తగ్గుముఖం పడుతుందని సూచిస్తున్నాయి. సాంక్రమిక వ్యాధుల విషయంలో దక్షిణాఫ్రికా, భారత్ మధ్య కాస్త సారూప్యతలు ఉన్నాయి. ఇరు దేశాల్లోనూ సహజ ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నాయి. అయినా వ్యాక్సిన్ పంపిణీలో మాత్రం భారత్‌లో భారీస్థాయిలో పంపిణీ జరిగిందని అరోఢా గుర్తు చేశారు.
1892 ఒమిక్రాన్ కేసులు
దేశ వ్యాప్తంగా ఇప్పటికే 23 రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించింది. ఇప్పటివరకు 1892 మందిలో ఒమిక్రాన్ బయటపడింది. మహారాష్ట్రలో అత్యధికంగా 568 నమోదు.. కాగా, ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152, తమిళనాడులో 121 కేసులు నమోదయ్యాయి.

Covid 3rd wave started in India: Dr NK Arora

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News