- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు 3 వేల దిగువనే నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ 15 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా మరణాలు 30 లోపే నమోదవుతున్నాయి. శుక్రవారం 4,99,282 కరోనా పరీక్షలు చేయగా, 2323 కొత్త కేసులు బయటపడ్డాయి. శుక్రవారం 25 మరణాలు సంభవించగా, మొత్తం మరణాలు 5,24,348 కు చేరుకున్నాయి. శుక్రవారం 2346 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు (98.75 శాతం )కు చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 14,996 (౦.౦౩ శాతం) గా నమోదైంది. శుక్రవారం 15,32,383 డోసులు పంపిణీ కాగా, మొత్తం డోసుల సంఖ్య 192 కోట్లకు పైగా చేరింది.
- Advertisement -