Wednesday, January 22, 2025

42,219కి తగ్గిన కొవిడ్ యాక్టివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Covid active cases reduced to 42219

న్యూఢిల్లీ: దేశంలో కొత్త గా 4,194 కరోనా కేసులు శుక్రవారం నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 4,29,84,261కి చేరుకుంది. కాగా..మరో 255 మరణాలు చోటుచేసుకోవడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,15,714 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. గడచిన 24 గంటల్లో 2,269 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో యాకివ్ కేసుల సంఖ్య 42,219కి క్షీణించింది. ఇప్పటివరకు మొత్తం 4,24,26,328 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.70 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 179.72 కోట్ల డోసులకు పైగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News